TELUGU BLOGS' COMMENTS
భళ్ళముడి శ్రీరామ శంకర ప్రసాద్
"కులుకులు మారినంత ఘన కోకిల కంఠము మారిపోవునా
కలుపుల దెచ్చి చేర్చినవి కాలము తో పర రాజ్య పాలనల్
అలకువ లున్న నేమి మన యాద్యుల భాషను తార్చి యుంచమే
తెలుఁగు తెలుంగు తెల్గని సుధీవరు లెల్లరుఁ బల్కు టొప్పునే"
A.Satyanarayana Reddy
"దేశ భాషల లో కడుఁ దియ్యన మన
తెలుఁగు తెలుఁగని ధీవరుల్ వలుకఁ, దగునె
తనివితో పరభాషను తగులుకొనుట
మాత్రుభాష వీడ వలదు ఛాత్రులార
"
జిగురు సత్యనారాయణ
"తెలుఁగు తెలుంగు తెల్గని సుధీవరు లెల్లరుఁ బల్కు టొప్పునే
పలుకులు భారతీ కరవిపంచిన మ్రోగెను సస్వరంబుగన్
పలికిన పల్కు పల్కు పలు భావములందున పంచదారగా
జలజల జాలు వారిన విశారద భాషయె తెల్గు కావునన్||

పలుకుటొప్పున్ + ఏ పలుకులు = పల్కుటొప్పునేపలుకులు"
రాజేశ్వరి నేదునూరి
"తేనె కురిపించు పదముల తీయ దనము
కవులు పండితు లల్లెడి కావ్య వనము.
తెలుఁగు తెలుఁగని ధీవరుల్ వలుకఁ , దగునె
యితర భాషల మోజున వెతను బడగ"
JJK Bapuji
""తెలుగు పలుకు లనంగను వలవదు మరి
వేదముల కొలదియగనె పేర్కొనుండు
తెలుగు తెలు "గని ధీవరుల్ వలుక;దగునె
సభల మనబాస పలుచన సలుపుటెల్ల?"
G P Sastry
"దేశ భాషల నన్నిట తెలుగు లెస్స!
తల్లి లేనిదె భువిలోన పిల్ల లెచట?
వట్టి మాటల నిట్టివి కట్టి పెట్టు:
"తెలుఁగు తెలుఁగని ధీవరుల్ వలుకఁ దగునె?"


...ఇంత కన్నా చేత కాదు సార్! సమస్యయే సరిగా అర్ధం కాలేదు 😄"
పిరాట్ల.వెంకటశివరామ కృష్ణప్రసాదు
"చం.ఉదయమెలేచిజేరితి సుదర్శనమైనసుమాలతోటలో
చదివితికావ్యమాలలచమక్కులనీలుసుగంధపద్యముల్
మధనముచెందెనామదిసుధారసమొల్కనిపద్యభావమో
ప,దములు లేని పద్యముల వ్రాయవలెన్ కవు లెల్ల రౌననన్?

భావము: ప్రొద్దున్నే మంచి పూలతోటలో కూర్చొని చక్కని చమక్కులు వున్న పద్యములెన్నో చదివాను కాని మనస్సు చంపుకొని అమృతముకురువనటువంటి పద్యములు వ్రాయటమును ఓర్చి బొత్తిగా సోగాసులేని పద్యాలను కవులు ఖచ్చితంగా వ్రాయాలా అన్న భావనలో వ్రాసిన పద్యం . ఆశీర్వదిస్తారని కవికులానికి నమస్కరించి వ్రాసిన పద్యము.
note : ఇక్కడ దమము యనగా సొగసులు అని అర్ధము."
తోపెల్ల బాలసుబ్రహ్మణ్య శర్మ
"పలుకు పలుకున తేనియ లొలుకు భాష
తెలుఁగు తెలుఁగని ధీవరుల్ వలుకఁ, దగునె
తెలుగు పలుకులు పలుకక కులుకు లొలుకు
ఆంగ్ల పలుకులు పలుకుట హాని కాదె!"
koride vishwanatha sharma
"పదుగురు మెచ్చని రీతుల్
మది బాధించెడు వికార మలినపు కథలున్
పదశాస్త్రవిరోధములగు
పదములు లేకుండ వ్రాయవలెఁ బద్యములన్""
రాజేశ్వరి నేదునూరి
"శంకరాభరణము నుండి శ్రీ శంకరయ్యగారి సమస్య
" పదములు లేకుండ వ్రాయవలెఁ బద్యములన్ "
--------------------------------------
సదమల హృదయము తోడను
చదువరులకు హాయి నిచ్చు చందనము వలెన్
పదుగురు దూషణ జేసెడి
పదములు లేకుండ వ్రాయవలెఁ బద్యములన్"
Sainadh Reddy
"LV Gangadhara Sastry Inspirational Speech Bhagavad Geetha Foundation"
Kranthi Muppidi
"Super ra"
Kranthi Muppidi
"Ok"
bhaskar
"Nice information sir"
Sainadh Reddy
"మార్చడం జరిగినది. ధన్యవాదములు నరసింహారావు గారు."
Anonymous
"లేదండీ మీరు మీ ఫ్లోలోనే కంటిన్యూ అవండి :-) నేనే కొంచెం వేరే పనుల్లో బిజీగా ఉండి ఆలోచించలేకపోయాను. కిషోర్ గారు, మీరు చెప్పగానే అర్రే ఇవి చెప్పలేకపోయానా అని అనిపించింది జయభేరి ట్యూన్ లోనే కరెక్ట్ గా పాడుకున్నాను కానీ పాట గుర్తురాలేదు :-)"
Anonymous
"హహహహ అశోకుడి ఎపిసోడ్ భలే :-) మీ నాన్నగారిని మించిన వారు గురువుగారు ఎంతైనా గురువుగారు కదా మరి.. కబుర్లు బావున్నాయండీ.."
Anonymous
"ఒక్క టిక్కెట్ మీద నాలుగు సినిమాలు చూపించేశారండీ బావుంది. మొన్నెప్పుడో రవితేజ కోసం అంటే ఏదో అనుకున్నా కానీ స్వాతి కోసం లండన్ బాబులు చూసిన మీ ధైర్యానికి జోహార్లు చెప్పకుండా ఉండలేకపోతున్నాను :-) మిగిలిన మూడు సినిమాలు నాక్కూడా నచ్చేశాయ్."
రసజ్ఞ
"Thanks Mahesh gaaru.... _/\__"
రామ్
"ఎంత మంచి పోస్ట్ వేణు గారు !!

మాటల్లో చెప్పటం అనవసరం ....రాజా బీజీమ్ బీజమ్ గా వేసుకోవడమే !!"
Sainadh Reddy
"Come, Join the volunteering bandwagon and experience the joy of giving."
Sainadh Reddy
"Come... Lets celebrate the spirit of nationalism..."
Mahesh
"Dear Rasajna,

I admire your blog so much and spend most of my time with it. Your effort is commendable.

Please don’t misunderstand my corrections, if any. My effort is to bring to your notice any typo or mishearing, so as to make lyrics flawless.

Regards,
Mahesh Adiraju

చరణం 1:

(1) పొగడాకు తేనెలతో పొదరిల్లు కడిగేసినా
(2) ………
(3) ………
(4) ………
(5) ………
(6) గోరింక వలచింది గోరింట పండింది"
Sainadh Reddy
"మరి మన దేశాన్ని రక్షించుకోవడం ఎలా? మరో వ్యాసం లో.

- నమస్సులతో మీ నరసింహా మూర్తి."
Sainadh Reddy
"భారతీయత - హిందుత్వం: జాతీయత గందరగోళం - 1
- నమస్సులతో మీ నరసింహా మూర్తి."
Sainadh Reddy
"విజయనగరం జ్ఞాపకాలు.
- నమస్సులతో మీ నరసింహా మూర్తి."
విన్నకోట నరసింహా రావు
"ఏమిటి జిలేబి గారూ, చక్రాన్ని మళ్ళా కనిపెట్టే ప్రయత్నమేదన్నా చేస్తున్నారా మీరు? ☺"
విన్నకోట నరసింహా రావు
"సంఘటన ఆసక్తికరంగా ఉంది.

"తిరువనంతపురం (నేటి త్రివేండ్రం)" అన్నారు పైన. నాటి త్రివేండ్రం కానీ నేటి త్రివేండ్రం కాదు రెడ్డి గారూ. ఆ ఊరి అసలు పేరు ఎప్పుడూ తిరువనంతపురమే. ఆంగ్లేయుల హయాంలో త్రివేండ్రం అన్నారు. తదనంతరం తిరిగి అధికారికంగా తిరువనంతపురం అయింది.
(నేను కొంతకాలం ఆ నగర నివాసిగా ఉన్నాను)"
శ్యామలీయం
"జ్యోతి గారూ,

మీరు నూఱు పుస్తకాలు ప్రచురించిన సందర్భంలో అనేక అభినందనలు.

మీరు నూఱు పుస్తకాలు ప్రచురించారు కానీ ఒక్క పుస్తకం ప్రచురణ చేయించాలంటే నాబోంట్లకు గుండెదడ మరి!

మీ సంస్థ వేయి పుస్తకాలు ప్రచురించాలి. అది నేను చూడాలి. అదీ నా ఆకాంక్ష.

మొన్న ఆదివారం నాడు సరిగా అదే సమయానికి మరొక సాహిత్యకార్యక్రమంలో పాల్గొన్నాను!
"
Giri Raju Battu
"Arjun Reddy is movie on a glorified mental retard . ఇది సినిమా కనుక ఒక happy ending ఇచ్చారు. ఐతే విజయ్ బాగా act చెసాడు . A new talented hero for telugu industry."
Anonymous
"Each splinter group wants a separate state. Pseudo intellectuals like gouri lankesh espouse their cause. The real enemies for India aren't terrorists rather the pseudo sickulars and misguiding intellectuals."
Zilebi
"

వృత్తపు చుట్టుకొలతకున్
వృత్తపు వైశాల్యమునకు బృందారముగన్
చిత్తపు కైపు జిలేబియు
కొత్తగ యనుబంధము కనుగొనె హరి బాబూ :)

జిలేబి :)"
Haribabu Suraneni
"వీటిని కూడా కందాల్లో చెబితే జనం చచ్చుండేవాళ్ళు.
జేకే:-)"
Zilebi
"
సప్తాస్యాసన్ పరిధయః....


జిలేబి"
phaneendra
"why should one need to divide with 7000. I mean, what is its significance?"
Anonymous
"Zelebi

wonderful relation deciphered :) for 21870 well done. lol :) :) :)"
Zilebi
"

Both of you have found rightly.

My guess I think it represents closely PI;( when you divide it by 7000 )

Another way when you divide by 9 power 4 you get recurring 3.333


జిలేబి"
భాస్కర రామిరెడ్డి
"Lalitha garu, I believe Zilebi is referring the sum of that number (18) and the association with the number of days the war occurred (18). Surprisingly the army combined in both sides is 18 (11+7).

If there is any other significance to 21870 number, I would also like to hear from Zilebi."
భాస్కర రామిరెడ్డి
"Lalitha garu, I believe Zilebi is referring the sum of that number (18) and the association with the number of days the war occurred (18). Surprisingly the army combined in both sides is 18 (11+7).

If there is any other significance to 21870 number, I would also like to here from Zilebi."
Lalitha TS
"And that 1:1:3:5 ratio corresponds to the definition of Patti:

ఒకరథం+ఒక ఏనుగు+మూడు గుర్రాలు+ఐదుగురు కాలిబంట్లు = పత్తి"
hari.S.babu
"

@you
3. నా అనుభవం లో కినిగె fake message ఇవ్వదు.

hari.S.babu
That is enough for me,thanks!
I am too practical to believe such messages,Now I am happy.

మెచ్చుకోండి

"
bondalapati
"

1. మీ పుస్తకం భీభత్సం గా అమ్ముడు పోతూ ఉంది ఉండవచ్చుఁ..
2. కినిగె లో అమ్మకాలు సాధారణం గిన్నె తగ్గి పోయి, మీ పుస్తకం 4, 5 కాపీలమ్మినా టాప్ అయిపోయి ఉండవచ్చుఁ.
3. నా అనుభవం లో కినిగె fake message ఇవ్వదు.

మెచ్చుకోండి

"
Sainadh Reddy
"ఇప్పటికైనా మన ప్రభుత్వాల అడుగులు ఆ వైపుగా కదులుతాయని ఆశిద్దాం."
SURYAA NEWS PAPER
"dear sir you ur telugu blog super sir
Telugu News"
SURYAA NEWS PAPER
"dear sir telugu blog is super sir
Telugu News"
Lalitha TS
"సరిగ్గా చెప్పారు, కిషోర్‌గారు! చప్పట్లు!

ఇంక నా పోస్ట్ టైటిల్: జయభేరి సినిమాలో "యమునా తీరమున సంధ్యా సమయమున" పాటలో - "రానంత సేపు విరహమా - నేను రాగానే కలహమా!" లైనుకి అనుసరణ"
Lalitha TS
"అయ్యో! నేనే సరిగ్గా కన్వే చేయలేకపోయాను - పోన్లెండి ఈసారి కొంచెం పాపులర్ పాటలకి కొసరు పాటలిస్తాను. Thanks for trying."
Lalitha TS
"మా బుజ్జిజింక పియానో బిట్ మెచ్చుకున్న మీకు బోల్డన్ని థాంక్సులు :)"
Lalitha TS
"అన్యగామిగారు: మీరూ నాలాగే తారల విషయంలో దూర-వీక్షణాసక్తులన్నమాట :). మీ వ్యాఖ్యకి ధన్యవాదాలు."

పాలపిట్ట
"వేదనతో అయితే భావం పొంగును అని రుజువు చేశారు ఈ కవిత ద్వారా"
నీహారిక
"@ 3rd అజ్ఞాత అజ్ఞాత,

ఖాదర్ మొహియుద్దీన్ గారన్నట్లు "నేను పుట్టకముందే దేశద్రోహుల జాబితాలో నమోదై ఉంది నా పేరు" అన్నమాట !
గుర్రం జాషువా గారు అన్నట్లు " నిఖిల లోకమెట్లు నిర్ణయించినగానీ తిరుగులేదు విశ్వనారి నేను" !!!"
Sri Kanth
"నేను "శుక్రాచార్య" శ్రీకాంతునే లెండి ..!"
Anonymous
"మిమ్మల్ని బ్లాగర్లు సీరియస్ గా తీసుకోరు. మీరు అడుగు పెట్టటం, అందరూ తప్పు కొనేది ఎందుకనుకొంట్టున్నారు?

బ్లాగులో శర్మ గారంటే ఎంతో గౌరవం. ఆయనను మీరు వెంటాడుతూఉంటే, ఫాపం,
బకాసురుడి భోజనానికి చిక్కిన, బక్క బ్రాహ్మణుడులా బలయిపోయాడు అని బ్లాగర్ లు అనుకొన్నారండి."
నీహారిక
"ఈ వీడియో చూసినపుడల్లా నిద్ర వచ్చేస్తుంది. ఎప్పటికి పూర్తి చేస్తానో ...ఈ వీడియోలో ఆవిడ కుర్చీ వెనకాల చిరుగులు చూస్తే జంద్యాల పాపయ్య శాస్త్రి గారు "కూర్చుండ మా ఇంట కుర్చీలు లేవు" అన్నట్లు...చాలా పేదరికంలో ఉన్నట్లు అర్ధం అవుతున్నది. పేదరికంలో పుట్టడం తప్పుకాదుకానీ పేదరికంలో చనిపోవడం మాత్రం ఖచ్చితంగా అపజయమే ...ఒక స్త్రీవాదిగా, ఒక మార్కిస్టుగా తను ఏమి నేర్చుకున్నదన్నది ఇంకా తెలియవలసి ఉన్నది. మొత్తం వీడియో చూసాక అర్ధం అవుతుందేమో ! మార్కిస్టులు ధనవంతులు కాకూడదా ? ధనవంతుడైన తండ్రి మార్కిస్ట్ కాకూడదా ? రంగనాయకమ్మగారు వివాహం ఒక బానిసత్వం అన్నారు. బసవరాజు అప్పారావు గారు అన్నట్లు "వలపెరుగక బ్రతికి కులికి మురిసేకన్న వలచి విఫలమ్మొంది విలపింపమేలురా" అని సహజీవనాన్ని ఎంచుకున్నట్లున్నారు ! అది మరీ ఇంత ఘోరంగా ఉంది ఏమిటా అని ఒకటే బాధ పడ్డాను."
నీహారిక
"శ్రీకాంత్ గారు,

మీరు "తెలంగాణా" శ్రీకాంత్ గారా లేక "శుక్రాచార్య" శ్రీకాంత్ గారా ?

"కప్పి ఉంచితే కవిత్వం..విప్పి చెపితే విమర్శ" అని "సినారే" గారు అన్నట్లు విమర్శలకు జనసేనానులు పట్టించుకోనవసరం లేదులెండి. అజ్ఞాతగా వ్రాయవచ్చు కానీ నేను వ్రాయను. నీహారిక పేరుతో ఎవరైనా వ్రాస్తారేమో కానీ నేను మాత్రం నీహారికని కాను అని చెప్పే పరిస్థితి తెచ్చుకోను.

నేను రెండు టీ వీ ప్రోగ్రాంస్ చేసాను వాటిల్లో కూడా నీహారికా నాయుడు అనే వ్రాయమన్నాను. నా గూగుల్ ప్లస్ లో https://plus.google.com/u/0/+NiharikaNayudu అని ఉంటుంది. చాలామంది నాయుడు అని ఎందుకు పెట్టుకున్నారు అని గొడవచేస్తే పేరులో నుండి తీసాను కానీ గూగుల్ ప్లస్ లో పోవడం లేదు.

చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని వెనుకబడిన కులాల్లోకి చేరుస్తామన్నారండీ..అపుడు నేను కూడా నిమ్న జాతి స్త్రీ అయిపోతాను. ఇకమీదట ఎవరైనా నన్ను ఏమైనా అన్నారంటే నేను కూడా కులం కార్డ్ ఉపయోగించుకునే వెసులుబాటు వస్తుంది. దళితులు ఏదైనా అనవచ్చునని అందరూ గమ్మున పడి ఉంటారనే విషయం ఈ చర్చ వల్లనే తెలిసింది. ఇన్నాళ్ళు శర్మ తప్పుగా వ్రాసాడు కాబట్టి గమ్మున ఉన్నాడనుకున్నాను."
మోహిని
"మనసు చెందే వేదన తీర్చడం ఎవరితరం మేడమ్."
Zilebi
"

ఔరా! జీపీయెస్! మా
పై రయ్యన కందమొకటి పరుగెత్తించా
రే!రామ రామ! వేయుము
వారికి కందంబొకటి గబగబ జిలేబీ :
జిలేబి"
Sri Kanth
"నీహారిక గారు, మీరు నీహారికా నాయుడు అని మీ ప్రొఫైలులో కూడా ఎక్కడా మెన్షన్ చేయలేదు కదా ! దానితో ఆ అఙ్ఞాత అలా పొరపడి (నట్టు యాక్ట్) చేసినట్టున్నాడు. దానిదేముంది లెండి. మీరు దళితులు కారు, అసలు మీరు నీహారికయే కాదు అని చెప్పినా చెల్లుతుంది."
Sri Kanth
"@నీహారిక
కత్తి మహేష్ కులం కార్డు చేత కాక వాడుకోలేదు కదా !
నిజంగానే అటువైపు దళితుడు కాబట్టి వాదనకు రాగానే కొంత మంది ఆయన్ను కులం పేర బూతులు రాశారు (ప్రస్తుతం పవన్ కళ్యాన్ ఇష్యూలో) దానితో ఆయన అలా అన్నాడు.

ఇక పవన్ కళ్యాన్ ఫ్యాన్స్ ఆయనకు అనవసరంగా పబ్లిసిటీ పెంచుతున్నారు తప్పిస్తే ఆయన విమర్శలు పెద్దగా పట్టించుకోనవసరం లేనివి."
Zilebi
"

పదరకు! యీ పదముల వలె
పదములు లేకుండ వ్రాయవలెఁ బద్యములన్,
పదపద పో యనని గురువు
లు!దంగవకు! కుదురుగన్ తెలుపు కందివరుల్"
Sri Kanth
"@నీహారిక
భలే రాశారండీ, అచ్చం నాలాగే :-)"
Zilebi
"

హృదయపు కుహురము తెరచుచు
పదములు లేకుండ వ్రాయవలెఁ బద్యములన్,
పదుగురి గుండియలన్ తా
కి దుముకవలె గంగవలె సఖి కవన మదియే!

జిలేబి"
Zilebi
"

పదుగురు మెచ్చవలెన్ కై
పదములు లేకుండ వ్రాయవలెఁ బద్యములన్,
పదపడి పరుగెత్తవలెన్
హృదయస్పందనల రవళి హృత్సారమ్మై !

జిలేబి"
Zilebi
"

సదనము శంకరార్యులది ! చక్కటి ఛందపు పుష్ప మాలికల్
కుదురుగ ఠావుకొన్న యిలు; కూరిమిగా వ్యవహార గ్రామ్యమౌ
పదములు లేని పద్యముల వ్రాయవలెన్ కవు లెల్ల రౌననన్
కదనము కైపదమ్ములది ! కాకలుదేఱ నకో జిలేబియా !

జిలేబి"
Zilebi
"

కద‌నము జిలేబి ఛందము,
కుదురునె యిష్టమగు చాళి గూర్చన్! గానన్
సదనమున వ్యావహారిక
పదములు లేకుండ వ్రాయవలెఁ బద్యములన్ !

జిలేబి"
నీహారిక
"మళ్ళీ పప్పులో చెయ్యెట్టేసారు ..."వంటింట్లో మా అమ్మే రాణి అయినా గిన్నెలన్నిటిపైనా మా నాన్న పేరే"(విమల) అన్నట్లు నాయుడు అనగానే కమ్మ అని ఫిక్స్ అయిపోయారా ? మా ఇంటి పేరు "తిరుమలశెట్టి" ఇపుడు కనుక్కోండి చూద్దాం !"
bv
"

పెనిమిటి=భర్త, మొగుడు

మెచ్చుకోండి

"
Anonymous
"ఓహో, మీరు కమ్మవారా. ఆ విషయం తెలియదు లెండి. మీ పేరులో నాయుడు అని ఎక్కడ ఉంది? మీరు చెపితేనే గదా ఇప్పుడు తెలిసింది."
నీహారిక
"@రెండవ అజ్ఞాత,

నీహారికా నాయుడు అని నా పేరు చూసి కూడా నేను దళిత వర్గానికి చెందినదాన్ని అని మీకెలా అనిపించింది ? మొదటి అజ్ఞాత చెప్పినట్లు కత్తి మహేష్ ది కాపీ పేస్ట్ వాదన అనడం, నేను నోటికొచ్చినట్లు తిట్టానని అనడం రెండూ అబద్దాలే ! శర్మ వ్రాసిన బూతులు నేను కాపీ పేస్ట్ చేసాను.
కత్తి మహేష్ మేధావి, పవన్ అభిమానులు అమాయకులు అన్నది మాత్రం నిజం !
అజ్ఞాతలకున్న స్వేచ్చ మామూలు బ్లాగర్లకు లేదు. అలాగని ఏది బడితే అది మాట్లాడడమూ, ఏది బడితే అది ప్రచురించడం అగ్రహారం లో నేరాలు !
క్రింది స్థాయి ఆలోచనలు మానేసి కాస్త ఎదగండి...ఎదగమన్నాను కదా అని నిలువుగానో, అడ్డంగానో కాకుండా కత్తి మహేష్ లాగా మేధస్సు పెంచుకోమని అర్ధం."
Zilebi
"

పొగడాకు తేనియలతో
జిగిబిగి పొదరిండ్ల గూర్చి జిగదేరగనన్,
పగడము రతనమ్ములతో
గగన గతుల తో జిలేబి గావింపదగున్ !

జిలేబి"
viseshajna
"అర్ధం పర్ధంలేని వాదన!

ఒక్కసారి పురాణాల్నీ, ధర్మశాస్త్రాల్నీ తిరగేస్తే బ్రాహ్మణులు తమతమ రంగాల్లోకి బ్రాహ్మణేతరులు జొరబడకుండా ఎలాంటి దురాగతాలకు పాల్పడ్డారో తెలుస్తుంది. ఈరచయితకు తెలిసిందికూడా తెలియకనా పోతులూరి వీరబ్రహ్మం బ్రాహ్మణుల దురాగతాల్ని ఎండగట్టింది? ఆర్యసమాజమూ, రామ్మోహనరాయ్ పిచ్చివాళ్ళా? లేక నీడలతో పోరాడారా? బ్రాహ్మణులు పాలకులుగా లేకపోతేనేమి రాజుల కాళ్ళు పట్టించుకున్నారు (రామాయణం మరోసారి చదవండి) వాళ్ళకు రాజగురువులుగా ఉంటూ వాళ్ల ఆటలే సాగించుకున్నారు. ఒక నిజాన్ని పదిసార్లు అబధ్ధమన్నంత మాత్రాన అది అబధ్ధమైపోదు.

మొఘలులు చేసిన దురాగతాలు గుర్తుంచుకోదగ్గవే ఐతే, అంతకు ముందు బ్రాహ్మణులు (అందునా భారయతీయులయ్యుండీ, భారతీయులకు) చేసిన దురాగతాలూ గుర్తుంచుకోదగ్గవే!"
viseshajna
"అర్ధం పర్ధంలేని వాదన!

ఒక్కసారి పురాణాల్నీ, ధర్మశాస్త్రాల్నీ తిరగేస్తే బ్రాహ్మణులు తమతమ రంగాల్లోకి బ్రాహ్మణేతరులు జొరబడకుండా ఎలాంటి దురాగతాలకు పాల్పడ్డారో తెలుస్తుంది. ఈరచయితకు తెలిసిందికూడా తెలియకనా పోతులూరి వీరబ్రహ్మం బ్రాహ్మణుల దురాగతాల్ని ఎండగట్టింది? ఆర్యసమాజమూ, రామ్మోహనరాయ్ పిచ్చివాళ్ళా? లేక నీడలతో పోరాడారా? బ్రాహ్మణులు పాలకులుగా లేకపోతేనేమి రాజుల కాళ్ళు పట్టించుకున్నారు (రామాయణం మరోసారి చదవండి) వాళ్ళకు రాజగురువులుగా ఉంటూ వాళ్ల ఆటలే సాగించుకున్నారు. ఒక నిజాన్ని పదిసార్లు అబధ్ధమన్నంత మాత్రాన అది అబధ్ధమైపోదు.

మొఘలులు చేసిన దురాగతాలు గుర్తుంచుకోదగ్గవే ఐతే, అంతకు ముందు బ్రాహ్మణులు (అందునా భారయతీయులయ్యుండీ, భారతీయులకు) చేసిన దురాగతాలూ గుర్తుంచుకోదగ్గవే!"
viseshajna
"దీని గురించి Gurucharan Das అనే ఆయన ఒకానొక పుస్తకంలో ఈ విధంగా అభిప్రాయ పడ్డారు. జపాన్‌లోకూడా కులవ్యవస్థ ఉందికానీ అది మరీ ఇండియాలో ఉన్నంత rigid గా లేదు. అక్కడివారికి కులపరంగా పదోన్నతులుకూడా ఉండేవి. ఒకప్పుడు (60ల్లో) ఉత్తరాదిన కొన్ని గ్రామాల్లో కొందరు తమను తాము promote చేసుకోవడం ఉండేదికానీ, ఇప్పుడది పూర్తిగా నశించింది.

కులానికీ, మతానికీ సంబంధం లేదనడం సత్యదూరమైన వాదన. మనుస్మృతి జన్మ ఆధారంగా మనుషులను కులాలుగా విభజించి వారికి అర్హతలు నిర్ణయించిందని మనం చదివాం. కొన్ని గుళ్ళలో దళితులకి గతంలో ప్రవేశం కల్పించకపోవడం మనం చూశాం. ఈనాటికీ పల్లెల్లో పండగనాడు దళితులను దూరంగా ఉంచడం మనం చూస్తున్నాం. హిందూమత సాహిత్యంలో (రామాయణం సహా) బ్రాహ్మణులకు చేయాల్సిన దానధర్మాలను పొగుడుతూ, ఇతరుల ఏయే స్థానాల్లో ఉంచాలో చెప్పడంచూశాం. రామాయణం మతగ్రంధంకాదా? కులానికీ మతానికీ సంబంధంలేకపోతే మొత్తం హిందూమతం కులాంతో ఇంత obsessionకు గురై ఎందుకు ఉంది?

అసలు హిందూ మతం అంటూ ఏమీలేదు. ఉన్నదల్ల బ్రాహ్మణ మతమ్మాత్రమే! ఆ మతంలో బ్రాహ్మణులకు దక్కాల్సిన previleges చెప్పుకుంటూ వారు గ్రంధాలు రాసుకున్నారు. వారి కులస్తులను, వారు చెప్పిన విధంగా పాలించినవారినీ దేవతలుగా, గొప్పవారిగా కీర్తించుకున్నారు. ఈ మతం వారిని ఉధ్ధరించినంతగా, ఇంకెవరికీ దోచిపెట్టిందేమీలేదు. ఈమతంలో బ్రాహ్మణుణ్ణె సేవించినందువల్ల జరిగే పుణ్యలోకాలు అంటూ ప్రతి గ్రంధంలోనూ రాసుకున్నారు, బ్రాహ్మణుడు చెడ్డవాడైనా దండించకూడదనీ రాసుకున్నారు. దాన్నీ మన బ్రహ్మశ్రీ ప్రవచనకారులు చెబుతున్నారు."
Kondala Rao Palla
"దేవాలయల్లోకి దళితులు రాకూడదనేది మతపరమైన నిబంధన కాదా?"
Zilebi
"

బాలా కుమారి వినుమా
ఏలూరున నుండువార లెల్లరు కవులే
మా లావుగ చెప్పెదర
మ్మా లక్షణముగ కవితల మాటల కైపున్ :

జిలేబి"
వేణూశ్రీకాంత్
"ఆ క్లైమాక్స్ నాక్కూడా బాగా నచ్చేసిందండీ.. గుడ్ మూవీ.. ఏంటో ఈ మధ్య చిన్న సినిమాలు వరసగా మంచివి వచ్చేస్తున్నాయ్ ఆశ్చర్యంగా... నాగ్ కి గీతాంజలి నప్పినట్లు సుమంత్ కి ఈ రోల్ కూడా నప్పేసింది :-)"
నీహారిక
"అన్ని మతాలలోనూ కులాలున్నాయి కానీ హిందూ ధర్మంలో కులాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రొటెస్టంట్లు - క్యాధలిక్ లూ సమానమే, సున్నీలూ - షియాలూ సమానమే ! కానీ హిందూ ధర్మంలో కొందరు క్రింది స్థాయి మనుష్యులు వర్ణసంకరం చేయడమే కాకుండా కొన్ని వర్ణాలను విభజించి, కొన్ని వర్ణాలకు గొప్పతనం ఆపాదించి కొంత వ్యూహ రచన చేసారు. ఆ వ్యూహానికి ప్రతివ్యూహం కూడా సిద్ధమయ్యే ఉంటుంది. కుల ఏర్పాటు, కుల అంతరాలు హిందూ ధర్మం ఏర్పడిన తర్వాతే ఏర్పడ్డాయి కానీ హిందూ ధర్మం లో భాగం కాదు. ఏ ఒక్క వ్యక్తి వల్లో, ఏ ఒక్క కులం వల్లో హిందూ ధర్మం నడవదు. హిందూ ధర్మం సమిష్టి తత్వాన్ని ప్రోత్సహిస్తుంది. నేను శాస్వతుడిని అని అంటే కృష్ణుడు భోదించిన దాన్ని కృష్ణుడే విభేధించినట్లు కాదా ? శాస్వతుడు మోక్షాన్ని ఎలా సాధిస్తాడు? క్రింది స్థాయి వ్యక్తులు వర్ణాలను విభజించి మళ్ళీ వారే వర్ణాలను ఎలా ప్రోత్సహించగలరు ? నైజ గుణానికీ లొట్టకంటికీ మందు లేదు. హిందూ ధర్మమే తనను తాను రక్షించుకోవాలి."
Zilebi
"

మూన్నాళ్ళుగ వింజామర
వెన్నెలయే! చెలి,తనువును వెచ్చఁగఁ జేసెన్!
విన్నానమ్మ యనూష్కా !
వెన్నంటి విరాటు కొహిలి వేడిమి యటనే :


ಜಿಲೇಬಿ"
బాబు
"

):-

మెచ్చుకోండి

"
Anonymous
"http://www.mediacrooks.com/2017/12/congress-treachery.html"
నీహారిక
"గ్రామాల్లో సర్పంచి కి కూడా పూర్తి అధికారం లేదు. అన్ని పనులూ పంచాయితీ కార్యదర్శులే చూస్తారు. మోడీ కూడా ఏమీ చెయ్యలేరు. అధికారం అంతా అధికారుల చేతిలోనే ఉంటుంది. ఐ ఏ ఏస్ లూ, ఐ పీ ఎస్ లూ, న్యాయమూర్తులూ ఎవరూ ఏమీ చెయ్యలేరు. చేయవలసిందీ చేసేదీ ఓటర్లు మాత్రమే ! అందుకే ఓటర్లకి ఉచిత తాయిలాలు అందిస్తూ ఉంటారు. క్రింది స్థాయి మనుష్యులు మాత్రమే చేయగలిగిన పని, చేయగలిగి ఉండి కూడా చేయడం లేదంటే అలసత్వం ఏ మేరకు ఉన్నదో ఆలోచించండి. లోక్ సత్తా ఒక్కటే ఓటర్ల గురించి ఆలోచిస్తున్నది కానీ వారు చెప్పేది అర్ధం చేసుకునే స్థాయి ఓటర్ల కి ఇంకా రాలేదు. హిందూత్వ మైకం దిగితే గానీ ఓటర్ తనగురించి తాను తెలుసుకోడు."
బాబు
"

ఆంగ్లీకరణ అయినా సరిగా అఘొరించలేదనే ఆవేదనండి

మెచ్చుకోండి

"
Ramya Manchahe
"Ohhhhh sad :("
బాబు
"

మనము ఎలా చదవగలం అండి వారి మనసు.

మెచ్చుకోండి

"
Markandeya
"ఎండిన బీడులాయే గుండెలు, కురవని మేఘాలు అయినవి కళ్ళు, వేసవి గాలులే ఉచ్ఛ్వాస నిశ్వాసాలు...ఇంక తప్పక శోకసాగరం అయ్యెను మనసు అంటారా.

"
kinghari010
"

ఇది మరీ ఘోరం!
అది మాజీ అసినికాధికారులు కూడా హాజరైనబహిరంగ సమావేశం/పార్టీ.పాకిస్తాన్ రాయబార కార్యాలయం న్మన అదేసంలో ఉంది.అందులో పాకిస్తాన్ అధికారులు పనిచేస్తారు.వరికి వ్యక్తిగత మర్యాదలు ఉండవా?వారిని మన దేసస్థులు ఎవరూ కలవకూడదా?వారు మన దేసస్థులు ఎవరినీ కలవకూడదా?కలిస్తే వారు వీరి ప్రధానికీ వీరు వారి ప్రధానికీ సుపారీలు ఇవ్వడానికేనని తీర్మానించెయ్యడమేనా?
మోదీకి నిజంగా సిగ్గు లేదు!

మెచ్చుకోండి

"
raz
"Thank you sir for your reply and i will read those articles."
Mangaldeep
"Sai Baba Mantra for Job:
If you are looking for job and need success in your career, this mantra will helps you to get the job succeed in your career.
Mantra to Chant:
" Trayanam devanam thrigunajanitanam tav Shive |
Bhavet puja puja tav charanayorya virachita ll ||"
To get more details about mantras, pujas, bhajans and chants, download Mangaldeep app and get all benefits, https://goo.gl/JQd6De"
Haribabu Suraneni
"నాకు జిల్లాలని స్వయంపూర్ణం చెయ్యడం అనే ఆలోచన ఎప్పుడో వచ్చింది - ఇక్కడి అయిదు భాగాలు చదివి చూదండి.

"
raz
"సార్, నాకు ఒక ఆలోచన ఉంది, మీ అభిప్రాయం చెప్పండి.
మన దేశాన్ని రాష్త్రాలుగా కాకుండా జిల్లాలుగా / ప్రాంతాలుగా విభజించి ఒక జిల్లాకు ఒక IAS అధికారిని నియమించాలి. ఎలక్షన్లు అనేవే ఉందకూడదు. ఈ జిల్లా అధికారులను నియమించదానికి / నియంత్రించడానికి సుప్రీం కోర్టు యెలాగూ ఉంటుంది. ఆ జిల్లాలు భాషా ప్రాతిపదికిన ఉంటే బాగుంటుంది. ఆ ప్రాంతంలో మైనారిటి భాషకు రెండవ అధికార భాషగా గుర్తించాలి. ప్రకృతి వనరులు, నీటి ప్రాజెక్టులు,దేశ రక్షణ సుప్రీం కోర్టు అధీనంలో ఉండాలి. ఏ ప్రాంతంలోని ప్రజలు ఎక్కడైనా నివసించవచ్చు / చదువుకోవచ్చు / ఉద్యోగాలు చెయొచ్చు."
Haribabu Suraneni
"కులాలకీ మతానికీ సంబంధం లేదు అని తెలిస్తే ఇంక ఈ ప్రశ్నకి జవాబు సూటిగానే చెప్పొచ్చు.కులాలు లేక వృత్తిని బట్టి చేసిన విభజనలు అన్ని సమాజాల్లోనూ ఉన్నాయి.ఎక్కడైనా సరే అవి మతానికి సంబంధించినవి కాదు,సామాజిక,ఆర్ధిక అవసరాల కోసం ఏర్పడినవి కాబట్టి వాటి అవసరం వున్నంతవరకు కులాలు ఉనికిలో ఉంటాయి,ఆ కులాల వాళ్ళకి తమ కులం యొక్క అవసరం లేనప్పుడే కులాలు పోతాయి."
Zilebi
"

మొన్నటి నుండీ చూస్తు
న్నాన్నండీ కవివరా! మన సదనమందున్
పున్నమియే కైపదమై
వెన్నెలయే చెలి తనువును వెచ్చఁగఁ జేసెన్ :

జిలేబి"
Anonymous
"the source of Hindu Dharma...
http://indiafacts.org/sources-hindu-dharma-1/"
Anonymous
"http://www.opindia.com/2017/12/science-channel-video-clip-saying-ram-setu-was-man-made-goes-viral-on-social-media/

రామసేతును కట్టింది మనుష్యులే"
sam
"congratulations

Telugu News
Telangana News"
Sridhar Bukya
"ఎవరి బాధ వారిది.
కొంత మంది బాగుపడుతుంటే ఓర్వ లేక నవ్వు నటిస్తు నట్టేట ముంచి ఏడ్చే రకం.. ఇంకొంత మంది మా కంటే ఎదిగిపోతారని తెలిసి ఎలా ఐన వారి ప్రమేయం ఉన్నా లేనట్టుగానే వ్యవహరిస్తు ఎదుటివారికి ఇబ్బంది కలిగితే లోలోపల ఆనందిస్తూనే పైకి ఏడుపు నటించే రకం.. అసలు సిసలైన బాధను బాధగా సంతోషాన్ని సంతోషంగా స్వీకరించేవారు ఒక్క తల్లిదండ్రులే వారి తర్వాత భార్యకు భర్త భర్త కు భార్య.. తక్కిన వారు మొసలి కన్నీళ్ళు నటిస్తు ఆ కుతంత్రపు కన్నీళ్ళ కుంటలో ఇతరులను తోసి లోలోపల దాస్టిక ఆనందాన్ని పొందుతారని నా అభిప్రాయం పద్మ గారు.

తెలుగు మహసభ శుభాభినందనలతో"
Lakshmi
"ఈ మధ్య కాలం లో తెలుగు సినిమాలకి వెళ్ళాలి అంటే పర్సుకి భారీగా చిల్లెట్టుకుని మరీ తలనొప్పి, మెదడు వాపు వ్యాధీ గట్రా తెచ్చుకోటం అవుతోంది. మీరు బాగుంది అని రాసారు అంటే ఖచ్చితంగా ధైర్యం చేయవచ్చు కాబట్టి ఈ వారాంతంలో మళ్ళీ రావా జిందాబాద్. "సుమంత్ అభావంగా నటించేసి"... వేసుకోండి నాలుగు వీరతాళ్ళు. కాకపోతే మిగతా నక్షత్రాల్లా ముభావంగా నటించలేదు కాబట్టి క్షమించేయవచ్చు."


See also
Aavakaaya.comCurrent version of Maalika has been developed by Sreenu and maintained by Bharadwaj and Sreenu. Copyright © 2010
మాలిక: తెలుగు బ్లాగుల సంకలిని మరియు తెలుగు బ్లాగర్ల వేదిక
Follow Maalika on Facebook   Follow Maalika on Twitter  Chrome App for Maalika